"శాసనసభ" నుండి రీసెంట్గానే 'నన్ను పట్టుకుంటే' అని సాగే మాంఛి పెప్పీ పార్టీ సాంగ్ ఒకటి రిలీజై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా శాసనసభ మేకర్స్ మరొక సాంగ్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు నవంబర్ 19వ తేదీన పొలిటికల్ యాంథం లిరికల్ వీడియో పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుందని మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసారు.
వేణు మండికంటి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ భకుని, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa