సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "మసూద". ఇందులో తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్నారు. హర్రర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. నవంబర్ 18న ధియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజుగారు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి చుక్కల్ని తాకే అనే ప్రేమ గీతం విడుదలైంది. ఈ పాటకు ప్రశాంత్ విహారి సంగీతం అందించగా, సింగర్ అభయ్ జోధ్ పుర్కర్ పాడారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa