బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతుండడంతో మెగాస్టార్ ఈ సినిమా కోసం ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకపక్క వాల్తేరు వీరయ్యగా నటిస్తూనే మరోపక్క ఆ పాత్రకు డబ్బింగ్ కూడా చెప్తూ మెగాస్టార్ డబుల్ స్ట్రైన్ అవుతున్నారట. మరికొన్ని రోజుల్లో చిరు తన పాత్ర డబ్బింగ్ పూర్తి చెయ్యనున్నారట.
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa