ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తునివు' గురించి సాలిడ్ అప్‌డేట్ ని వెల్లడించిన జిబ్రాన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 05:01 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 10, 2023న విడుదల కానుంది అని సమాచారం. ఈ సినిమా అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు సంచలనం సృష్టించాయి. ఈ సినిమా సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ మొదటి సింగిల్ మాస్ నంబర్ అని వెల్లడించారు. అజిత్ అభిమానిగా ఈ పాట కోసం తన పూర్తి ప్రయత్నాలను అందించానని, అంచనాలను పెంచానని చెప్పాడు. ఈ మాటలతో అజిత్ అభిమానులు ఈ సాంగ్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి సింగిల్‌ చిల్లా చిల్లా అనే టైటిల్ ని పెట్టగ ఈ పాటని  సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుధ్ పడినట్లు సమాచారం.

ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతునట్లు సమాచారం. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa