ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సేతుపతి 'డీఎస్పీ' మొదటి సింగిల్ ని విడుదల చేయనున్న అనిరుధ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 05:05 PM

పొన్‌రామ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన 46వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'డీఎస్పీ' అని టైటిల్ ని ఖరారు చేసారు. తాజాగా ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ నల్లా ఇరుమ ఈరోజు సాయంత్రం చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటను డిజిటల్‌గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 2, 2022న సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన అనుకీర్తి వాస్ జోడిగా నటిస్తుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa