టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ రోజుతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 22 ఏళ్ళను పూర్తి చేసుకున్నారు. బాల రామాయణంలో బాల రాముడిగా సినీ ప్రస్థానం మొదలెట్టిన తారక్ 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా డిబట్ ఎంట్రీ ఇచ్చారు. vr ప్రతాప్ డైరెక్షన్లో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా 2001, మే 25న విడుదలైంది. ఈ సినిమా కోసం హీరోగా షూటింగ్ మొదలెట్టిన తారక్ నేటితో 22 ఏళ్ళను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తారక్ కు శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఇలాంటి ఇంకెన్నో సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa