మరో సినీ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘కడలి’ మూవీ ఫేం గౌతమ్ కార్తీక్, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మోహన్ నవంబర్ 28న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాము రిలేషన్ లో ఉన్నామంటూ ఇటీవల ఈ జంట అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరూ దేవరట్టం సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. పెళ్లి అనంతరం స్నేహితులు, సన్నిహితుల కోసం ఊటీలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.