సమంత తొలి పాన్ ఇండియా మూవీ "యశోద"కు వరల్డ్ వైడ్ గా విశేష స్పందన వస్తుంది. ఇంటర్నేషనల్ రీచ్ ఉన్న సరోగసీ కాన్సెప్ట్ తో, బలమైన కథనంతో, ముఖ్యంగా సమంత పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు తొలి రోజు తొలి షో నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 3 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ తో నిలిచింది. మరి వీక్ డేస్ లో యశోద ప్రదర్శన ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల ద్వయం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించగా, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, మురళీశర్మ, రావురమేష్, సంపత్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు. మణిశర్మ స్నాగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa