గతేడాది విడుదలైన "రౌడీ బాయ్స్" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హలో చెప్పిన యంగ్ హీరో ఆశీష్ రెడ్డి. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పక్కా లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసింది.
ఆశీష్ రెండవ సినిమా "సెల్ఫిష్" త్వరలోనే పట్టాలెక్కబోతుంది. మొదటి సినిమా లాగానే ఈ సినిమాను కూడా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చెయ్యనున్నారు. ఈ సినిమాను కాశీ విశాల్ డైరెక్ట్ చెయ్యబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని ఇండస్ట్రీ టాక్. విశ్వక్ సేన్ గత చిత్రం "అశోకవనంలో అర్జునకళ్యాణం" సినిమాతో యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసి, తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. వచ్చే నెల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ కు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa