అల్లరి నరేష్ 59వ చిత్రంగా తెరకెక్కిన "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" సినిమాకు సంబంధించి కొంచెంసేపటి క్రితమే థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. మారేడుమిల్లి ప్రజల ఓట్లు కావాలనుకునే అక్కడి రాజకీయ నాయకులు వారి సమస్యలను అస్సలు పట్టించుకోరు. ఆ ఊరికి ఎలక్షన్స్ అధికారిగా వెళ్లిన నరేష్ ఆ ఊరి ప్రజల సమస్యలకు చలించిపోయి, వారి తరపున ప్రభుత్వం తో చేసే పోరాటమే ఈ సినిమా. ట్రైలర్ సినిమాపై చాలా మంచి ఆసక్తిని కలుగజేస్తుంది. ఈ సినిమాతో నరేష్ నుండి మరొక "నాంది" వంటి సినిమాను ఎక్స్పెక్ట్ చెయ్యవచ్చు.
హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు AR మోహన్ డైరెక్టర్ కాగా, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘుబాబు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 25న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa