మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న చిత్రం "కింగ్ ఆఫ్ కోత". ఈ సినిమాకు దుల్కర్ క్లోజ్ ఫ్రెండ్ అభిలాష్ జోషే దర్శకుడు. జీ స్టూడియోస్, వే ఫేరర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్ కోసం ముందుగా మేకర్స్ క్రేజీ హీరోయిన్ సమంతను అప్రోచ్ అయ్యారట. ఐతే, సమంత తన అనారోగ్య సమస్య మరియు ఆల్రెడీ కమిటెడ్ ప్రాజెక్ట్స్ వల్ల ఈ బిగ్ ఆఫర్ కి నో చెప్పిందట. దీంతో మేకర్స్ మరొక క్రేజీ హీరోయిన్ రితికా సింగ్ తో ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. ఇందుకు సంబంధించి రితిక కింగ్ ఆఫ్ కోత సెట్స్ లో ఉన్న పిక్స్ మీడియాలో వైరల్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa