"సర్దార్" గా ఇటీవలే కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించి, వారి విశేష ఆదరణకు నోచుకున్న స్టార్ హీరో కార్తీ లేటెస్ట్ గా తన కొత్త సినిమా "జపాన్" ను ఈరోజే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ను రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తుండగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్లను కార్తీ అందుకున్నారు. ఒకటి మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ కాగా, మరొకటి PS మిత్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన సర్దార్. ఈ ఏడాదిలోనే విడుదలైన కార్తీ మరొక సినిమా విరుమాన్ కూడా మంచి విజయం సాధించింది కానీ తెలుగులో ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa