చిన్న సినిమాగా విడుదలైన లవ్ టుడే కోలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ప్రశాంత్ రంగనాథన్ డైరెక్షన్లో యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో ప్రశాంత్ రంగనాథన్ హీరోగా యాక్టింగ్ డిబట్ చేసారు. ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
నవంబర్ 4న విడుదలైన ఈ మూవీ కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యడానికి రెడీ అయ్యారు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు. అతి త్వరలోనే అంటే ఈ నెల్లోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుందని తెలుపుతూ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa