నటసింహం నందమూరి బాలకృష్ణ తో హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారి ఒక సినిమా చెయ్యబోతున్నారు. అధికారికముగా ఎనౌన్స్ చెయ్యబడిన ఈ సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యింది. ఈ మేరకు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద NBK 108 స్క్రిప్ట్ ను ఉంచి పూజలు చేయించారు అనిల్ రావిపూడి.
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఈ నెల్లోనే ప్రారంభం కావలసి ఉంది. కానీ, వీరసింహారెడ్డి షూటింగ్ లో బాలయ్య తలమునకలై ఉండడంతో NBK 108 షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించట్లేదు. తాజా అప్డేట్ ప్రకారం, వచ్చే జనవరి నుండి ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కచ్చని అంటున్నారు.
శ్రీలీల ఇందులో బాలయ్య కూతురిగా నటిస్తుండగా, బిగ్ బాస్ ఫేమ్ బిందు మాధవి కీరోల్ లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa