కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగు డిబట్ మూవీ 'సార్' గతంలోనే డిసెంబర్ 2వ తేదీన విడుదలయ్యేందుకు ముహుర్తాన్ని ఖరారు చేసుకుంది. ఐతే, లేటెస్ట్ గా ఈ సినిమా విడుదల తేది వాయిదా పడినట్టు సోషల్ మీడియా సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావడానికి ఈ సినిమా రెడీ అవుతుందని అంటున్నారు. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే.
సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు, తనికెళ్ళ భరణి గారు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa