ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"తునివు" డబ్బింగ్ పూర్తి చేసిన అజిత్ కుమార్ ... పోస్ట్ ప్రొడక్షన్స్ షురూ !!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 02:49 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న సరికొత్త చిత్రం "తునివు". హెచ్ వినోద్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.


ఈ నేపథ్యంలో తునివు డబ్బింగ్ పనులు జోరుగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా హీరో అజిత్ తన పార్ట్ డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.


బే వ్యూ ప్రాజెక్ట్స్ , జీ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa