తలపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్న వారిసు ఫస్ట్ సింగిల్ కి సంబంధించి కొంచెంసేపటి క్రితమే ప్రోమో రిలీజ్ అయ్యింది. 'రంజితమే రంజితమే' అనే ఈ పాట ఔటండౌట్ పక్కా డాన్స్ నెంబర్ గా ఉండనున్నట్టు తెలుస్తుంది. విశేషమేంటంటే, ఈ పాటను తలపతి విజయ్ స్వయంగా ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. పూర్తి పాట నవంబర్ 5న విడుదల కాబోతుంది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్, రష్మిక జంటగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
ఇంకా ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శామ్, శ్రీకాంత్, ఖుష్బూ, జయసుధ, యోగిబాబు, సంగీత కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa