టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య రీసెంట్ గా 'కృష్ణ బృందా విహారి' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఇప్పుడు, ఈ హ్యాండ్సమ్ హీరో తన తదుపరి చిత్రాన్ని 'NS 24' అధికారికంగా ప్రకటించారు. అన్ని ఎమోషనల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి SS అరుణాచలం రచన మరియు దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ని ఖరారు చేయని ఈ సినిమా కోసం నాగశౌర్య మేకోవర్ కూడా చేయించుకున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని అందించనున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa