హీరో నందు, యాంకర్ రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్న చిత్రం "బొమ్మ బ్లాక్బస్టర్". రాజ్ విరాట్ డైరెక్షన్లో రొమాంటిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ తో, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. రఘు కుంచె, కిరీటి దామరాజు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa