నాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా ప్రొడక్షన్ హోస్ లో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైం యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అడివి శేష్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి రావురమేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో రావు రమేష్ వైజాగ్ ఏడీజీపీ నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఈ పాత్ర ప్రభావం ఇంటెన్సిఫైడ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
జాన్ స్టీవర్ట్ ఏడూరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 3న హిట్ టీజర్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa