సీతారామం సినిమాతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. తాజాగా దుల్కర్ సమంత నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "యశోద" మలయాళ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు యశోద మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. ఈ మేరకు అక్టోబర్ 17సాయంత్రం 05:36 నిమిషాలకు దుల్కర్ యశోద మలయాళ ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నారు.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల ద్వయం డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ కు మణిశర్మ గారు సంగీతం అందించారు. పోతే ఈ చిత్రం నవంబర్ 11వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa