సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే కదా. దాదాపు పుష్కరం తదుపరి ఈ కాంబోలో సినిమా రాబోతుండడంతో ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమాపై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే, బాలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కు స్టైలిష్ విలన్గా నటించబోతున్నారని టాక్. ఈ విషయమై ఫిలింనగర్ సిర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa