చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటిస్తున్న చిత్రం "GTA" (గన్స్ ట్రాన్స్ యాక్షన్). అశ్వద్ధామ ప్రొడక్షన్ బ్యానర్ పై దీపక్ సిద్దాంత్ ఈ సినిమాను నిర్మించడమే కాక డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మమ్మ మామమియా అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను టాలీవుడ్ యువహీరో ఆకాష్ పూరి విడుదల చేసారు. ఈ పాటను మార్క్ కే రాబిన్ స్వరపరచగా, పార్థసారథి ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు.
ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా కేవీ ప్రసాద్, ఎడిటర్ గా గారి BH పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa