నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో "బింబిసార" ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమాతోనే కళ్యాణ్ రామ్ గ్రాండ్ కం బ్యాక్ ఎంట్రీ ని అందుకున్నారు. ఈ సినిమాతోనే కెరీర్ లో త్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అంతేకాక నిర్మాతగా కూడా ఘనవిజయం సాధించారు.
ఆగస్టు 5వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ అమేజింగ్ పెర్ఫార్మన్స్, ఎం ఎం కీరవాణి గారి మైండ్ బ్లోయింగ్ BGM, కొత్త దర్శకుడు వసిష్ఠ డిఫరెంట్ టేకింగ్, ... ఇలా చెప్పుకుంటూ పోతే,... ఈ సినిమాకు పని చేసిన ప్రతి నటుడు, ప్రతి సాంకేతిక నిపుణుడు కూడా ఎంతో అద్భుతంగా పని చేశారనే చెప్పాలి.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ ఐన ఈ సినిమా తాజాగా డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుండే అంటే మరి కొన్ని నిమిషాల్లోనే బింబిసార జీ 5 ఓటిటిలోకి అందుబాటులోకి రాబోతుంది. సో, ఎవరైతే, బింబిసారను పొరపాటున థియేటర్లో మిస్ అయ్యారో వారు త్వరగా జీ 5 యాప్ లోకి వెళ్ళిపోయి వెంటనే చూసెయ్యండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa