మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త చిత్రం "గాడ్ ఫాదర్". దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. మెగాస్టార్ ను ఇప్పటి వరకు చూడని పవర్ఫుల్ "బ్రహ్మ" అవతారంలో చూసిన జనాలు ఈ సినిమాకు నీరాజనాలు పలుకుతున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి బ్లాస్ట్ బేబీ అనే ఐటెం సాంగ్ యొక్క పూర్తి వీడియోను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. కధలో భాగంగా వచ్చే ఈ పాట అటు గ్లామరస్ గానూ, ఇటు ఉత్కంఠగానూ ఉంటుంది. వారిన హుస్సేన్ ఈ పాటకు చిందేయ్యగా, దామిని భట్ల, బ్లాజ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు.
మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్' కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, మురళీశర్మ, సునీల్, షఫీ, అనసూయ, గంగవ్వ కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa