కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారి నటిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం "సార్". తమిళంలో "వాతి" ఈ సినిమా టైటిల్. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మేరకు డిసెంబర్ 2వ తేదీన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఐతే, తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వెనక్కి వెళ్ళబోతున్నట్టు టాక్. మరి, ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావలసి ఉంది.
సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa