ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2' OTT విడుదల తేదీ పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 09:06 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో ఆదిత్య మీనన్, హర్ష చెముడు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు.


'కార్తికేయ 2' సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT స్ట్రీమింగ్ రైట్స్ ని ZEE5 భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అక్టోబర్ 7, 2022న నుంచి ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని సమాచారం. ఈ విషయం గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే మూవీ మేకర్స్ నుండి వెలువడనుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa