ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'SSMB28' లో మహేష్ బాబు రోల్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 09:03 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజగా మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్‌పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ గా నటిస్తున్నాడని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఇటీవల మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో యాక్షన్ ప్యాక్ వైబ్ ఉన్నట్లు తెలుస్తుంది.


ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa