టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవలే "భళా తందనానా" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు నుండి రాబోతున్న "అల్లూరి" పై ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో కయదు లోహర్ హీరోయిన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఖాకీ దుస్తులు ధరించి, గన్ చేతపట్టి ఒక ఫెరోషియస్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
పోతే, రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 49 నిమిషాల 37 సెకన్ల నిడివితో ఈ సినిమా ధియేటర్ ప్రేక్షకులను అలరించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa