యాంకర్ సుమా క్రేజీ కిచెన్ అనే ప్రోగ్రామ్ చేస్తోంది. తాజాగా ఈ షోలో అనసూయ ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ట్విట్టర్ వార్ గురించి అనసూయ ఆసక్తికర విషయాలు చెప్పింది. తనను అందరూ అత్త అనడం తనకు ఇష్టం లేదని, తన కోడలు కూడా తనను అనసూయ అనే పిలవాలని తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. అసలు ఇటీవల అనసూయ ఆంటీ అని పిలవడంపై సోషల్ మీడియాలో చాలా సీరియస్ అయిన సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా తెలుగు టాప్ యాంకర్ సుమతో పాటు క్రేజీ కిచెన్ అనే కార్యక్రమానికి సంబంధించి అనసూయ కూడా జాయిన్ అయ్యింది. సుమ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం కానున్న ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో సుమ అనసూయ ఇంగ్లీషు భాష గురించి, అత్తగారి గురించి కూడా తమదైన శైలిలో కామెడీ డెవలప్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa