ధనుష్, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం "తిరుచిత్రంబలం" ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి రివ్యూలతో పాటు సాలిడ్ కలెక్షన్లను కూడా రాబట్టుకుంది.
థియేటర్లలో ఈ సినిమా సందడి ముగియగా, లేటెస్ట్ గా రేపటి నుండి ఈ సినిమా డిజిటల్ లో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటిటి సన్ నెక్స్ట్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
తెలుగులో తిరు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఇక్కడ కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. పోతే, ఈ సినిమాలో రాశీఖన్నా, ప్రియభావాని శంకర్, ప్రకాష్ రాజ్, భారతి రాజా కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa