ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా నటిస్తున్న చిత్రం "ది ఘోస్ట్". ఈ చిత్రానికి భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్ లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పోతే, ఈ చిత్రం అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడంతో సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రొమోషన్స్ స్పీడ్ పెంచారు. లేటెస్ట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోనాల్ చౌహన్ యొక్క ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సోనాల్ ప్రియా అనే ఇంటర్పోల్ ఆఫీసర్ గా నటిస్తుంది. ఇందుకోసం సోనాల్ గన్నులతో చేసిన ప్రాక్టీస్, ఇంకా యాక్షన్ స్టన్ట్స్ కోసం పడ్డ కష్టం అంతా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa