ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రమ్ వేద' ట్రైలర్ రిలీజ్ కు టైం ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 07, 2022, 09:37 PM

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం 'విక్రమ్ వేద'. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్రంవేద కు ఈ సినిమా అఫీషియల్ హిందీ రీమేక్. తమిళంలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన పుష్కర్ గాయత్రీలే హిందీలో కూడా తీస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్ తో ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ నుండి లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల కాబోతుంది. రేపు మధ్యాహ్నం రెండింటికి విక్రంవేద ట్రైలర్ విడుదల కాబోతుంది.
రాధికా  ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ ను ఈ రోజే దాదాపు పది నగరాల్లో ఎక్స్క్లూజివ్ ప్రివ్యూ వేశారు. హైదరాబాద్, ముంబై, పూణే, జైపూర్, బెంగళూరు, న్యూ ఢీల్లి, కోల్కతా, అహ్మదాబాద్, భువనేశ్వర్, దుబాయ్ నగరాల ప్రేక్షకులకు మాత్రమే ఈ అద్భుతమైన అవకాశం దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa