శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం' రూపొంది విడుదలకు సిద్దంగా ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ తన జీవితంలో కష్టపడిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. గతంలో 'కో అంటే కోటి' సినిమా చేసి అప్పుల పాలైనట్లు తెలిపాడు. ఆ అప్పులు తీర్చడానికి ఒక చొక్కా కూడా కొనకుండా ఆరేళ్లు కష్టపడి అప్పు తీర్చినట్లు తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa