భారతదేశపు ఉత్తమమైన నటుల్లో ఒకరు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ నటుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఈ రోజు. 1955 ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరులో జన్మించిన చిరంజీవి నేడు 67వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా మెగా హీరోలు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయనకు శుభాకాంక్షలను తెలియచేసారు. ఈ పిక్స్ మెగాఫ్యాన్స్ ను ఫుల్ థ్రిల్ చేస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సింపుల్ అండ్ స్వీట్ మెస్సేజ్ తో తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలపడమే కాక, ప్రపంచంలో ఉత్తమమైన తండ్రిగా పేర్కొన్నాడు. అలానే వరుణ్ తేజ్ కూడా పెద్ద డాడీ కి బర్త్ డే విషెష్ తెలిపారు. ఇక, మెగా మేనల్లుడు,యంగ్ ఏజ్ లో చిరంజీవికి జిరాక్స్ కాపీగా ఉండే సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ యుక్తవయస్సు ఫోటోను పోస్ట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa