ఈ రోజు టాలీవుడ్ సీనియర్ హీరో, సినీ కళామతల్లి ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరు నటిస్తున్న అప్ కమింగ్ ప్రాజెక్టుల నుండి థ్రిల్లింగ్ అప్డేట్స్ వచ్చాయి.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్నట్టు ఆ మూవీ మేకర్స్ ప్రకటించగా, మరొక సినిమా "భోళాశంకర్" వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ డైరెక్టర్ కాగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ రెండు చిత్రాలు కూడా రీమేక్ సినిమాలే. గాడ్ ఫాదర్ మలయాళ సూపర్ హిట్ మూవీ "లూసిఫర్" కు తెలుగు రీమేక్ కాగా, భోళాశంకర్ కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ "వేదాళం"కి రీమేక్ వెర్షన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa