గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి శ్రీ. వెంకయ్య నాయుడుగారి చేతులమీదుగా "ఖుదీరాం బోస్" అనే మూవీ యొక్క టైటిల్ పోస్టర్ కొంచెంసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను విద్యాసాగర్ రాజు డైరెక్ట్ చేస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గోల్డెన్ రైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జాగర్లమూడి రజిత విజయ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతుంది. ఖుదీరాం బోస్... భారతదేశపు తొలి పిన్న వయస్సు కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు. పోతే, ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa