దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సునీల్, అనసూయ భరద్వాజ్, సుధీర్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, సప్తగిరి, శ్రీనివాస రెడ్డి ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం "వాంటెడ్ పండుగాడ్". 'పట్టుకుంటే కోటి' శీర్షిక.
శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబా కోవెలమూడి, వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రాత్రి ఏడు గంటలకు మూవీ టీం విడుదల చేస్తారని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విశాఖపట్నం, జైల్ రోడ్ లోని CMR షాపింగ్ మాల్ లో జరగనుంది. పోతే, ఈ చిత్రం ఆగస్టు 19వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. హిలేరియస్ ఎంటెర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ రచయిత జనార్ధన మహర్షి అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa