టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఇక అప్పటి నుండి ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.
లేటెస్ట్ గా అనిల్ రావిపూడి ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అనిల్ విశాఖపట్నం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని, NBK 108 మూవీ స్క్రిప్ట్ ను స్వామి వారి పాదాల చెంత పెట్టి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అనిల్ పూజ చేయిస్తున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తుంది. కొంచెంసేపటి క్రితమే మేకర్స్ ఈ రోజు సాయంత్రం 04: 28 గంటలకు ఈ మూవీ నుండి ఫస్ట్ అప్డేట్ రాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మింపబడుతుంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa