ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న నాగచైతన్య "థాంక్యూ"

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 02:06 PM

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన "థాంక్యూ" ఇటీవల థియేటర్లలో విడుదలై ఎంతటి డిజాస్టర్ కలెక్షన్లను రాబడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైతు హిట్ ట్రాక్ కు సడెన్ బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా. అలానే దిల్ రాజు కు కూడా గట్టి షాక్ ఇచ్చింది. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు.
జూలై 22న విడుదలైన ఈ సినిమా తొలి వీకెండ్ కే క్లిజింగ్ కొచ్చేసింది. దీంతో మూడు వారాల గ్యాప్ లోనే థాంక్యూ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఆగస్టు 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో థాంక్యూ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో సంస్థ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. నాగచైతన్య కెరీర్లో డిజాస్టర్ ఐన ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa