ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటరెస్టింగ్ టైటిల్ తో... నెట్ ఫ్లిక్స్ లో నయనతార పెళ్లి...

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 02:24 PM

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. జూన్ 9వ తేదీన, చిరకాల మిత్రుడు, ప్రేమికుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు నడిచిన ఈ 37ఏళ్ళ సీనియర్ హీరోయిన్ తన సినీ కెరీర్ తో పాటుగా మోస్ట్ మెమొరబుల్ ఫెయిరీ టేల్ మ్యారేజ్ ను కూడా పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేసుకుంది. తన పెళ్లిని ఎక్క్లూజివ్ గా ప్రసారం చేసేందుకు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ తో భారీ డీల్ ను కుదుర్చుకుంది.
తమ ఓటిటిలో అధికారిక ఎంట్రీ ఇవ్వబోతున్నారని పేర్కొంటూ, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను గతంలో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్ సంస్థ లేటెస్ట్ గా , నయన్, విఘ్నేష్ ల పెళ్లి వీడియోకు "నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్" అనే టైటిల్ ను ఎనౌన్స్ చేసింది. ఈ వీడియోను త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు కూడా తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa