ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాప్సీ 'దోబారా' ప్రమోషన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 11:54 AM

తాప్సీ పన్ను, పావైల్ గులాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'దోబారా'. 2018లో విడుదలైన స్పానిష్ సినిమా 'మిరాజ్ కి రీమేక్ ఇది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ మిస్టరీ డ్రామా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది తాప్పీ. సోమవారం బ్లూ లవ్ చూపించింది. బ్లూ కలర్ పాయింట్, బ్లూ కలర్ జాకెట్ తో.. ట్రెండ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. మీరెందుకు 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొనడం లేదు ? అనే ప్రశ్న తాప్సీకి ఎదురైంది. 'నా సెక్స్ లైఫ్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. అందుకే కనిపించడం లేదని బోల్డ్ గా సమాధానం ఇచ్చింది సొట్టబుగ్గల సుందరి. ఇక తాప్పీ సొంత బ్యానర్ 'అవుట్ సైడర్స్ ఫిల్మ్' లో -Dhak Dhak' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa