ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రెడ్ శాండల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ "పుష్ప". గతేడాది విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో పుష్ప 2 పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పుష్ప 2 కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుస్తుంది. ఈ మేరకు సుకుమార్, లిరిసిస్ట్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ముగ్గురూ కలిసి యూరోప్ కి వెళ్లారట. అక్కడే పుష్ప 2 సాంగ్స్ కంపోజ్ చెయ్యనున్నారట. అది పూర్తైన వెంటనే ఇండియాకు తిరిగొచ్చి పుష్ప 2 షూటింగ్ ను మొదలుపెట్టనున్నారట. సుకుమార్ - దేవిశ్రీప్రసాద్ కాంబోలో వచ్చిన సినిమాల్లోని పాటలన్నీ చార్ట్ బస్టర్లే. లేటెస్ట్ గా వచ్చిన పుష్ప కూడా అందులో ఒకటి. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలవడంతో మరొక చార్ట్ బస్టర్ ఆల్బం కు ముహూర్తం ఖరారైనట్టే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa