బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియాభట్ తొలిసారి కలిసి స్క్రీన్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న చిత్రం "బ్రహ్మాస్త్ర". అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి దేవా దేవా అని సాగే పాటను మేకర్స్ విడుదల చేసారు. హీరో తన స్పెషల్ పవర్ ను తెలుసుకుని ఆశ్చర్యపోయే సమయంలో వచ్చే ఈ పాటను ప్రీతం స్వరపరచగా, శ్రీరామచంద్ర, జోనితగాంధీ, అర్జిత్ సింగ్ కలిసి ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యమందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి సమర్పించడం విశేషం. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనిరాయ్ కీలక పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa