నాగచైతన్యతో ప్రేమ పెళ్లి తరవాత కూడా సమంత సినీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు కొనసాగింది. కానీ, ఎప్పుడైతే, విడాకులు తీసుకుందో అప్పటి నుండి ఇండస్ట్రీలో తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి, క్రేజీ ఆఫర్లు అందుకోవడానికి సామ్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఒక్క "ఖుషి" తప్ప సమంతకు చెప్పుకోదగిన అవకాశాలు రాకపోవడంతో, బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. దీంతో అక్కడ తనకెంతో పేరు తెచ్చి పెట్టిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మేకర్స్ తెరకెక్కిస్తున్న, అత్యంత ప్రతిష్టాత్మకమైన "సిటాడెల్" వెబ్ సిరీస్ లో నటించడానికి సమంత ఒప్పుకుంది.
లేటెస్ట్ గా సమంత టాలీవుడ్లో చాన్నాళ్ల తరవాత ఒక క్రేజీ అండ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. అదే ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ ఛాన్స్. కొరటాల - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో గతంలో వచ్చిన "జనతా గ్యారేజ్" లో సమంత హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు ఈ సినిమాలో సమంత ను హీరోయిన్ గా తీసుకుందామనుకుంటున్నాడట కొరటాల. విడాకుల తరవాత సమంతకొచ్చిన బిగ్ ఆఫర్ ఇది. కానీ, ఇది ఒప్పుకోవడానికి తన బాలీవుడ్ కమిట్మెంట్స్ అడ్డుపడుతున్నాయని బాధ పడుతుందట సమంత. ఆల్రెడీ కమిట్ ఐన వాటిని ఇప్పుడు చెయ్యనని చెప్పడం కుదరదు కాబట్టి, డేట్స్ అడ్జస్ట్ చేసే క్రమంలో ఎన్టీఆర్ సినిమాను హోల్డ్ లో పెట్టిందట. మరి, ఈ విషయంలో సామ్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa