ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాస్ ఆడియన్స్ కోరుకునే ఫుల్ మీల్స్ "మాచర్ల నియోజకవర్గం"

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 04:24 PM

యంగ్ హీరో నితిన్, ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి జంటగా MS. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ... మాచర్ల నియోజకవర్గం...మాస్ ఆడియన్స్ కోరుకునే ఫుల్ మీల్స్ ఇస్తుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో , అన్ని రకాల ఆడియన్స్ థియేటర్ కొచ్చి చూసే మంచి ఎంటర్టైనర్... అని చెప్పారు.
గత చిత్రాలు చెక్, మ్యాస్ట్రో డిజాస్టర్ కావడంతో, ఈ సినిమా విజయంపై నితిన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి , నితిన్ నమ్మకం ఎంతవరకు నిలబడిందనేది ఆగస్టు 12 వ తేదీన ఆడియన్స్ రెస్పాన్స్ తో తెలియనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa