MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరినీ అలరించే ఈ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa