ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB 28: "భీమ్లానాయక్" బ్యూటీకి హ్యాండిచ్చిన త్రివిక్రమ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 04:44 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లానాయక్" సినిమాతో మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఒక్క సినిమాతోనే సంయుక్తా తెలుగునాట బాగా పాపులారయ్యింది. ప్రస్తుతం తెలుగులో క్రేజీ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న సంయుక్తకు డైరెక్టర్ త్రివిక్రమ్ గతంలోనే ఒక అడ్వాన్స్ ఆఫర్ ను ఇచ్చారని వినికిడి. అదేంటంటే, త్రివిక్రమ్ మహేష్ బాబుతో చెయ్యబోయే సినిమాలో సంయుక్త ను సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటానని ముందే ఆమెకు చెప్పారని టాక్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, SSMB 28లో సంయుక్త నటించట్లేదని తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ బింబిసారలో కీలకపాత్ర పోషించింది సంయుక్త. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సంయుక్త తన తదుపరి ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన "సార్", మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో మరొకటి... కేవలం ఈ రెండు సినిమాలే ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులని చెప్పింది. దీంతో సంయుక్త మహేష్ సినిమాలో నటించట్లేదని క్లారిటీ వచ్చింది. దీనికి కారణం త్రివిక్రమ్ అని అంటున్నారు. సంయుక్త కన్నా మరొక యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ ను తీసుకోవాలన్న ఆలోచన ఉండడంతోనే, త్రివిక్రమ్ సంయుక్తను కాదన్నారట. మరి, ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa