ప్రాజెక్ట్ కే నిర్మాతల్లో ఒకరైన అశ్వినీదత్ గారు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రభాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. అందుకే సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోతున్నారని ఆయన చెప్పారు. ఈ వార్త విన్న చాలామంది ప్రభాస్ మరొక సర్జరీ కోసం విదేశాలకు వెళ్లారని, ఇక షూటింగులు మళ్ళీ ఆలస్యమవుతాయని, దీంతో లేటెస్ట్ అప్డేట్లు రావని... ఇలా పలురకాలుగా చెప్తున్నారు.
కానీ, ప్రభాస్ విదేశాలకెళ్లింది... సర్జరీ కోసం కాదంట.. ఈ ఏడాదిలో చేయించుకున్న మోకాలి సర్జరీ తాలూకు పోస్ట్ ఓపీ చెకప్ కోసమంట. అక్కడే ఒక వారం ఉండి, తిరిగి ఆగస్టు మొదటి వారంలో ఇండియాకు బయలుదేరనున్నాడట. ఆపై వెంటనే, సలార్, ప్రాజెక్ట్ కే షూటింగులతో బిజీ కానున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa