ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, టెలివిజన్ హోస్ట్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న "కాఫీ విత్ కరణ్" షో సీజన్ 7 మూడు ఎపిసోడ్లకే ఎంతగా పాపులరయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో అక్కడ రికార్డు స్థాయి వ్యూయర్ షిప్ రాబడుతుంది.
కాఫీ విత్ కరణ్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే పాల్గొంటున్నారు. ఆ తరవాతి ఎపిసోడ్ లో "లాల్ సింగ్ చద్దా" టీం పాల్గొనబోతుందని తెలుస్తుంది. లాల్ సింగ్ చద్దా మెయిన్ క్యాస్ట్ ఆమీర్ ఖాన్, నాగ చైతన్య ఈ షోలో పాల్గొంటారని అంతా అనుకుంటున్నారు. అంతకుముందు ఈ షోలో పాల్గొన్న సమంత తన మ్యారేజ్ లైఫ్ మీద, చైతు మీద చేసిన హాట్ కామెంట్స్ ఎంత కాంట్రవర్సీ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు అలానే చైతు కూడా ఆ షోలో పాల్గొని సామ్ కు బుద్ధి చెప్తాడని అనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. ఎందుకంటే, ఈ షోలో ఆమిర్ ఖాన్ సోలోగా పాల్గొంటారని కరణ్ కంఫర్మ్ చేసారు. సామ్ పై రివెంజ్ తీర్చుకునే అవకాశాన్ని చైతు చేజేతులా వదులుకున్నాడని అభిమానులు నిరాశ చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa